మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 18:36:02

స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని త‌నువు చాలించిన విద్యార్థి

స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని త‌నువు చాలించిన విద్యార్థి

జ‌గిత్యాల : ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు త‌ల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనివ్వ‌లేద‌ని మ‌న‌స్తాపం చెందిన విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘ‌ట‌న జ‌గిత్యాల జిల్లా బీర్పూర్ మండ‌లం కొల్వాయి గ్రామంలో మంగ‌ళ‌వారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఆకుల సాయిరాం(16) అనే బాలుడు స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. విద్యార్థి తండ్రి రాజేశం క‌ల్లుగీత కార్మికుడు, త‌ల్లి శంక‌ర‌వ్వ‌ బీడీ కార్మికురాలు. ఆన్‌లైన్ పాఠాలు వినేందుకు గ‌త నాలుగు రోజులుగా విద్యార్థి స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందిగా అడుగుతున్నాడు.

ఆర్థిక స్థోమ‌త లేని కార‌ణంగా ఫోన్ ఇప్పించ‌లేక‌పోయారు. దీంతో మ‌న‌స్తాపం చెందిన విద్యార్థి కుటుంబ స‌భ్యులు ప‌నికి వెళ్లిన స‌మ‌యంలో ఇంట్లో సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చుట్టుప్ర‌క్క‌ల‌వారు చూసి త‌ల్లిదండ్రులకు స‌మాచారం అందించారు. ఎస్ఐ మ‌నోహ‌ర్ రావు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని త‌ర‌లించారు. తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ చేప‌ట్టారు. 


logo