శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 17:15:09

ప్ర‌తిఘ‌టించిన బాలిక‌పై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు

ప్ర‌తిఘ‌టించిన బాలిక‌పై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు

రాయ్ పూర్ : అత్యాచార ఘ‌ట‌న‌ను ప్ర‌తిఘ‌టించిన బాలిక‌పై ఇద్ద‌రు దుండ‌గులు పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టారు. బాధితురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్ గ‌ఢ్‌లోని బీమితార జిల్లాలో జూన్ 22న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

14 ఏళ్ల బాలిక త‌న ఇంటికి 200 మీట‌ర్ల దూరంలోని పొలంలోకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో ఆమె ఇంట్లో ఎవ‌రూ లేరు. దీంతో తాను చ‌దువుతున్న పాఠ‌శాల‌లోని ఇద్ద‌రు సీనియ‌ర్లు.. మైన‌ర్ వ‌ద్ద‌కు వెళ్లారు. ఆమెపై అత్యాచారం చేసేందుకు య‌త్నించారు. దుండ‌గుల య‌త్నాన్ని బాలిక తీవ్రంగా ప్ర‌తిఘ‌టించింది. 

దీంతో ఆమెపై పెట్రోల్ పోసి త‌గుల‌బెట్టి అక్క‌డ్నుంచి ఇద్ద‌రు ప‌రారీ అయ్యారు. వీరిద్ద‌రిలో ఒక‌రు మైన‌ర్ ఉన్నారు. అయితే బాలిక ఇంట్లో లేక‌పోయే స‌రికి స‌మీప ప్రాంతాల్లో ఆమె త‌ల్లిదండ్రులు వెతికారు. మొత్తానికి 80 శాతం కాలిన గాయాల‌తో ఉన్న బిడ్డ‌ను గుర్తించి.. చికిత్స నిమిత్తం రాయ్ పూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ బాధితురాలు చ‌నిపోయింది. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ ఇద్ద‌రు దుండ‌గుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు డిమాండ్ చేశారు.  logo