శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 26, 2020 , 10:26:46

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘ‌ర్ష‌ణ : 8 మందికి గాయాలు

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘ‌ర్ష‌ణ : 8 మందికి గాయాలు

రాజ‌న్న సిరిసిల్ల : ఇల్లంత‌కుంట మండ‌లం రామోజీపేట‌లో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ప‌ర‌స్ప‌రం క‌ర్ర‌ల‌తో ఇరు వ‌ర్గాలు దాడి చేసుకున్నాయి. ఇరు వ‌ర్గాల దాడిలో 8 మందికి గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అంబేడ్క‌ర్ విగ్ర‌హ ఏర్పాటు విష‌యంలోనే ఇరు వ‌ర్గాల మ‌ధ్య దాడి జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా రామోజీపేట‌లో పోలీసులు మోహ‌రించారు.