సోమవారం 25 జనవరి 2021
Crime - Jan 11, 2021 , 22:03:43

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

నిజామాబాద్‌ : కామారెడ్డిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ స్థానికంగా ఉద్రికత్తకు దారితీసింది. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ స్థానికులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు కోసం గొడవ జరిగింది. వివాదం పెద్దదిగా మారడంతో ఇరువర్గాలకు చెందిన 60 మంది కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడులు చేసుకున్నారు.

దీంతో భయాందోళనకు లోనైన స్థానికులు దుకాణాలను, ఇళ్లకు తాళం వేసుకొని లోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘర్షణ జరుగుతున్న ప్రదేశానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇలాంటి ఘటనలను సహించేది లేదని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo