మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 30, 2020 , 20:07:54

రుణ యాప్‌ల కేసుల్లో చైనీయుడు అరెస్టు

రుణ యాప్‌ల కేసుల్లో చైనీయుడు అరెస్టు

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల కేసుల్లో పోలీసులు ఓ చైనీయుడిని అరెస్టు చేశారు. దేశం విడిచి వెళ్తుండగా ఢిల్లీ విమానాశ్రయంలో చైనా దేశస్థుడు జూ వీ అలియాస్‌ లాంబో(27)ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. లాంబో చైనాలోని జియాంగ్జీకి చెందినవాడు. ఆగ్లో టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, లియుఫాంగ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌, నాబ్లూమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, పిన్‌ప్రింట్‌ టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే నాలుగు కంపెనీలకు హెడ్‌ వ్యవహరిస్తూ రుణ యాప్‌లను నడుపుతున్నాడు. 

లాంబోతో పాటు ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజును పోలీసులు అరెస్టు చేశారు. లాంబోకు చెందిన కంపెనీ కాల్‌సెంటర్లలో నాగరాజుది ప్రముఖ పాత్రగా సమాచారం. యాప్‌ల ద్వారా ఇప్పటి వరకు 1.4 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. యాప్‌ల ద్వారా లాంబో రూ.21 వేల కోట్ల రుణాలు ఇచ్చినట్లుగా ఈ మొత్తం బిట్‌ కాయిన్‌ల రూపంలో నగదు విదేశాలకు బదిలీ అయినట్లుగా గుర్తించారు. గత 6 నెలల్లోనే భారీగా లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించారు. 


logo