ఆదివారం 17 జనవరి 2021
Crime - Dec 06, 2020 , 21:23:17

తాతతో సరదాగా వెళ్లి..

తాతతో సరదాగా వెళ్లి..

ఎదులాపురం: ఆదిలాబాద్‌ జిల్లా మావల మండలం వాఘాపూర్‌లో ఆదివారం సాయంత్రం ఎడ్లబండిపై నుంచి పడి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన చాకటి స్వామి గ్రామ శివారులోని ఇటుక బట్టిలో పనిచేస్తున్నాడు. ఆదివారం కూడా ఎడ్లబండిపై  బ‌య‌లుదేరాడు.  అత‌ని మనుమడు (కుమారుడి కొడుకు) చాకటి బ్రహ్మాత్‌( 4) కూడా వస్తానని అనడంతో వెంట తీసుకెళ్లాడు. ఇటుక బట్టిలో బండిని ఆపి, ఆయన పనికి వెళ్లాడు. ఇంతలో ఎడ్లు ముందుకు కదలగా, బండిపై ఉన్న బ్రహ్మత్‌ కింద పడిపోగా, తలకు తీవ్ర గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మావల పోలీసులు కేసు నమోదు చేశారు.