బుధవారం 03 జూన్ 2020
Crime - Mar 10, 2020 , 19:04:56

నీటి డ్రమ్ములో పడి చిన్నారి మృతి..

నీటి  డ్రమ్ములో పడి చిన్నారి మృతి..

మేడ్చల్‌: కొంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి నీటి డ్రమ్ములో పడి మరణించింది. దీంతో, చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగారు. చిట్టితల్లి మృతిని తట్టుకోలేని వారి రోదనలు.. చుట్టుపక్కల వారిని కలచివేస్తున్నాయి. ఎప్పటిలాగే ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి.. నీటిలో పడి మృతి చెందింది. తన గారాలపట్టి విగతజీవిగా పడి ఉండడం చూసి వారు రోదించారు. గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.


logo