బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 21:55:33

నీటి సంపులో పడి చిన్నారి మృతి

నీటి సంపులో పడి చిన్నారి మృతి

శంషాబాద్‌ : నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హుడా కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేఖర్‌, లక్ష్మీ దంపతులు కూలి పని చేసుకుంటూ శంషాబాద్‌లోని హుడా కాలనీలో నివాసముంటున్నారు. వీరికి నిత్యశ్రీ(3) పాప ఉంది. రోజూలానే చిన్నారిని ఇంటి దగ్గర ఉన్న బంధువుల వద్ద ఉంచి పనికి వెళ్లారు. చిన్నారి ఆడుకుంటు వెళ్లి ఇంటి ఎదుట ఉన్న నీటి సంపులో పడింది.

కొద్ది సేపటి తర్వాత పాప కనబడకపోవడంతో చుటుపక్కల చూడగా నీటి సంపులో పడి ఉన్న పాపను గమనించి బయటకు తీశారు. కానీ పాప అప్పటికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo