సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 16, 2020 , 11:49:10

టీవీ స్విచ్ ఆన్ చేయ‌మ‌న్నందుకు బాలిక‌ను చంపేశాడు

టీవీ స్విచ్ ఆన్ చేయ‌మ‌న్నందుకు బాలిక‌ను చంపేశాడు

చెన్నై : టీవీ స్విచ్ ఆన్ చేయ‌మ‌న్నందుకు ఓ బాలిక‌ను చంపేసిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. ఓ ఎనిమిదేళ్ల బాలిక త‌న త‌ల్లితో క‌లిసి జీవిస్తోంది. అయితే ఆమె త‌ల్లి కూలీకి వెళ్లిన వెంట‌నే.. టీవీ చూసేందుకు పొరుగింటిలోకి వెళ్లింది. అప్ప‌టికే తండ్రీకుమారులిద్ద‌రూ గొడ‌వ ప‌డుతున్నారు. ఆ గొడ‌వ మ‌ధ్య‌లోనే ఈ బాలిక టీవీ స్విచ్ ఆన్ చేయ‌మ‌ని అడిగింది.

ఆగ్ర‌హంలో ఉన్న ఆ వ్య‌క్తి బాలిక గొంతు నులిమి చంపాడు. ఆ త‌ర్వాత బాలిక మృత‌దేహాన్ని ప్లాస్టిక్ డ్ర‌మ్ములో వేసి మూత పెట్టారు. గంట త‌ర్వాత ఆ మృత‌దేహాన్ని తీసుకెళ్లి.. స్థానికంగా ఉన్న ఓ కాలువ‌లో ప‌డేశారు. ఈ విష‌యాన్ని ఓ వ్య‌క్తి గ‌మ‌నించి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

బాలిక‌ను చంపిన వ్య‌క్తితో పాటు అత‌నికి స‌హాయం చేసిన మ‌రొక‌రిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక పోస్టుమార్టం నివేదిక వ‌చ్చిన త‌ర్వాత నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం చేసి ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. 


logo