మంగళవారం 19 జనవరి 2021
Crime - Oct 12, 2020 , 15:29:01

పసిపాప‌ను చెరువులో తోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

పసిపాప‌ను చెరువులో తోసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

మెద‌క్ : ఓ త‌ల్లి దారుణానికి ఒడిగ‌ట్టింది. భ‌ర్త‌తో గొడ‌వ కార‌ణంగా త‌న పసిపాప‌ను చెరువులో తోసి తాను ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లా స‌మీపంలోని పిట్లం చెరువు వ‌ద్ద చోటు చేసుకుంది. మెద‌క్ ప‌ట్ట‌ణంలోని కుమ్మ‌రి బ‌స్తీకి చెందిన అనూష అనే వివాహిత త‌న భ‌ర్త ర‌వితో గొడ‌వ ప‌డింది. ఇరువురి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ‌తో అనూష తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. దీంతో త‌న 17 నెల‌ల కూతురు ప్ర‌ణ‌విని తీసుకుని ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయింది. పెద్ద కూతురు రిత్విక‌(4) త‌న అమ్మ‌మ్మ వ‌ద్ద ఉంటోంది. సోమ‌వారం ఉద‌యం త‌ల్లీబిడ్డ‌ల‌ మృత‌దేహాలు పిట్లం చెరువులో తేలాయి. ఈ క్ర‌మంలో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.