గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 30, 2020 , 17:57:05

ఎమ్మెల్యే హత్య కేసులో ముగ్గురి అరెస్టు

ఎమ్మెల్యే హత్య కేసులో ముగ్గురి అరెస్టు

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే భీమా మాందవి హత్య కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. నిందితులను లక్ష్మణ్ జైస్వాల్, రమేశ్‌ కుమార్ కశ్యప్, కుమారి లింగే థతిగా గుర్తించారు. నిందితులు ముగ్గురూ దంతెవాడ జిల్లాకు చెందిన వారే. 2019 ఏప్రిల్ 9న దంతేవాడ జిల్లా శ్యామ్‌గిరి గ్రామశివారులో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాందవిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో ఆయనతోపాటు నలుగురు సిబ్బంది మరణించారు.

ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, మందుగుండు సామగ్రిని సైతం మావోయిస్టులు దోచుకెళ్లారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించారు. నకుల్నార్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న లక్ష్మణ్ జైస్వాల్ మావోయిస్టులకు విద్యుత్ తీగలు, పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను సమకూర్చారని దర్యాప్తులో తేలింది. కక్కాడి గ్రామ మాజీ సర్పంచ్‌  రమేశ్‌ కుమార్‌ కశ్యప్‌తోపాటు కుమారి లింగేథతి నక్సల్స్‌కు సామగ్రి సమకూర్చడమే కాకుండా కుట్రలో పాల్పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను ఇప్పటికే జగ్‌దళ్‌పూర్‌ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి వారంరోజులపాటు‌ రిమాండ్‌ విధించారని పేర్కొన్నారు. 

తాజావార్తలు


logo