గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 20:40:12

రోడ్డు ప్రమాదంలో ఛతీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జి కుమారుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఛతీస్‌గఢ్‌ హైకోర్టు జడ్జి కుమారుడు దుర్మరణం

రాయ్‌పూర్ : ఛతీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్‌ జిల్లా బర్ఫానీ ఆశ్రమం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు శనివారం దుర్మరణం చెందినట్లు పోలీసులు తెలిపారు.  హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు గౌతమ్‌ చౌరాసియా కుమారుడు  శ్రేయాన్ష్‌ చౌరాసియా శనివారం ఉదయం 6 గంటల సమయంలో కారులో పెట్రోల్‌ నింపుకునేందుకు బర్ఫానీ ఆశ్రమం సమీపంలోని పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు.

పెట్రోల్‌ నింపుకొని బంకు నుంచి బయటకు వస్తుండగా కారును భారీ ట్రక్కు ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రేయాన్ష్‌ చౌరాసియాకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని అతడిని హుటాహుటిన సమీపంలో ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.logo