ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 31, 2020 , 16:44:35

కానిస్టేబుల్‌ క్రూరత్వం.. ఏడాదిన్నర పాపకు సిగరెట్‌తో వాతలు

కానిస్టేబుల్‌ క్రూరత్వం.. ఏడాదిన్నర పాపకు సిగరెట్‌తో వాతలు

రాయ్‌పూర్‌: ఏడాదిన్నర పాపకు సిగరెట్‌తో పలు చోట్ల వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందిన ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ క్రూరత్వం బయటపడింది. దీంతో అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించిన అవినాష్ రాయ్ సివ్ని ప్రాంతంలో నివాసం ఉండేవాడు. ఒక మహిళకు అతడు డబ్బులు ఇచ్చాడు. ఆమె భర్త నాగ్‌పూర్‌లో ఉంటున్నాడు. కాగా గత నెల ఆ కానిస్టేబుల్‌ను దుర్గ్‌కు ట్రాన్స్‌పర్‌ చేశారు. ఈ నెల 24న కానిస్టేబుల్‌ అవినాష్‌ డబ్బుల కోసం ఆ మహిళ ఇంటికి వచ్చాడు. ఆమె డబ్బులు ఇవ్వలేని పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఐదు రోజులు ఆ ఇంట్లోనే ఉన్నాడు. 

గురువారం రాత్రి ఆ మహిళను బాగా కొట్టాడు. అనంతరం ఆమె ఏడాది పాపను దగ్గరికి తీసుకున్నాడు. తనను నాన్న అని పిలవాలని అన్నాడు. ఆ చిన్నారి స్పందించకపోవడంతో కాలుస్తున్న సిగరెట్‌తో ఆ పాప ముఖం, పొట్ట, చేతులపై కాల్చి వాతలు పెట్టాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కానిస్టేబుల్‌ అవినాష్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం అతడ్ని అరెస్ట్‌ చేసినట్లు బలోద్‌ ఎస్పీ జితేంద్ర సింగ్‌ మీనా తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.