ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 15:04:42

చైన్‌స్నాచింగ్‌ ముఠా అరెస్టు

చైన్‌స్నాచింగ్‌ ముఠా అరెస్టు

నిజామాబాద్‌ : జిల్లాలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను ఆదివారం నిజామాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బోధన్‌కు చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 16.2 తులాల బంగారు ఆభరణాలు, 4 బైకులు, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు గత కొంతకాలంగా నిజామాబాద్‌తోపాటు డిచ్‌పల్లి, ఆర్మూర్‌ తదితర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారించిన తరువాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు చోరీలను మార్గంగా ఎంచుకున్నారని చెప్పారు.  


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.