ఆదివారం 24 జనవరి 2021
Crime - Nov 15, 2020 , 14:48:01

గొలుసు చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

గొలుసు చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌ : వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్‌నగర్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ముగ్గురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు. నిందితులు ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలో ఉన్న పుస్తెలతాళ్లు, బంగారు ఆభరణాలను లాక్కు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నిందితుల నుంచి 65 పుస్తెల తాళ్లు రికవరీ చేశారు. అలాగే రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ ముఠా ఏడు దొంగతనాలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo