గురువారం 02 జూలై 2020
Crime - Feb 21, 2020 , 13:46:20

నార్సింగిలో చైన్‌స్నాచర్‌కు దేహశుద్ది

నార్సింగిలో చైన్‌స్నాచర్‌కు దేహశుద్ది

హైదరాబాద్‌ : నగర శివారు నార్సింగిలో చైన్‌స్నాచర్‌ హల్‌చల్‌ చేశాడు. జన్వాడ గ్రామంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను గొలుసుదొంగ లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాగేందుకు విఫలయత్నం చేశాడు. అప్రమత్తమైన మహిళ స్నాచర్‌ చేయిని గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. మహిళ కేకలు విని స్థానికులు అక్కడి వచ్చారు. పారిపోయేందుకు ప్రయత్నించిన స్నాచర్‌ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.


logo