గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Jul 20, 2020 , 20:35:56

సెల్‌ చార్జర్ ఘర్షణ.... యువకుడి దారుణహత్యకు దారితీసింది

 సెల్‌ చార్జర్ ఘర్షణ.... యువకుడి దారుణహత్యకు దారితీసింది

కడప : కడపజిల్లాలో దారుణం జరిగింది. పట్టపగలే ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తుండగానే ఐదుగురు దుండగులు యువకుడిపై కత్తులతో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన వల్లూరు మండలంలోని లింగాయపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది.   లింగాయపల్లెకు చెందిన మధుసూదన్‌ కడప ఆర్ట్స్‌ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. మధుసూదన్ అమ్మమ్మ, పిన్నితో కలిసి లింగాయపల్లెలో చదువుకుంటున్నాడు. ఆదివారం సెల్‌‌‌ఫోన్ ఛార్జర్‌ విషయమై రత్నం, కృష్ణ, ఫణీంద్ర, నాగార్జున, పవన్‌కుమార్‌లతో అతడు ఘర్షణ పడ్డాడు.

ఈ నేపథ్యంలో సమీప బంధువు ఇరువర్గాలను సముదాయించి పంపించేశాడు. అయితే మధుసూదన్ తమపై ఎదురు తిరగడాన్ని తట్టుకోలేక పోయిన ఆ యువకులు మద్యం తాగి అరగంట తర్వాత అక్కడికి చేరుకున్నారు. కత్తులతో మధుసూదన్‌పై విచక్షణా రహితంగా దాడిచేసి చాతిపై మూడుచోట్ల పొడిచారు. అనంతరం బైకులపై ఆ ఐదుగురు పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో మధుసూదన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మధుసూదన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.logo