సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 13:21:34

లైంగికదాడి నిందితులకు మరణశిక్ష.. పోలీస్‌స్టేషన్‌లో సంబరాలు

లైంగికదాడి నిందితులకు మరణశిక్ష.. పోలీస్‌స్టేషన్‌లో సంబరాలు

ముంబై: ఒక బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు కోర్టు మరణశిక్ష విధించింది. దీంతో సంబంధిత పోలీసులు పోలీస్‌స్టేషన్‌లో సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర బుల్దానాలోని చిఖ్లిలో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన 9 ఏండ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ కేసుపై విచారణ జరిపిన స్థానిక సెషన్స్ కోర్టు ఆ ఇద్దరు నిందితులను దోషులుగా నిర్ధారించడంతోపాటు మరణశిక్షను విధించింది.

మరోవైపు ఈ కేసు దర్యాప్తు కోసం చాలా శ్రమించిన చిఖ్లి పోలీసులు కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్ ఎదుట పటాకులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బాధిత బాలికకు న్యాయం జరుగడంపై తాము చాలా సంతోషంగా ఉన్నామని చిఖ్లి పోలీస్‌స్టేషన్ అధికారులు తెలిపారు.

logo