శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 28, 2020 , 20:19:43

లైంగికంగా వేధించిన వ్యక్తిని పట్టించిన సీసీటీవీ

లైంగికంగా వేధించిన వ్యక్తిని పట్టించిన సీసీటీవీ

బెంగళూరు: ఒక మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్‌ పట్టించింది. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. మంగళవారం ఉదయం 5.05 గంటలకు 20 ఏండ్ల వ్యక్తి 40 ఏండ్ల మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. జేసీనగర్‌లో ఇరుకైన సందులో వెళ్తున్న ఆమెను అడ్డగించి లైంగికంగా వేధించాడు. ఆమె ప్రతిఘటించడంతోపాటు కేకలు వేయగా చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు. దీంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడ్ని టాటా దత్‌గా గుర్తించారు. జేసీ నగర్‌కు చెందిన ఒక పోలీస్‌ అధికారి ఆ నిందితుడ్ని గుర్తుపట్టారు. అతడు గతంలో కూడా పలుమార్లు ఇలా ప్రవర్తించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు ఆ నిందితుడి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా దత్‌ పరుగెత్తుకుని తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో బాధితురాలు ఫిర్యాదు చేసిన గంటలోనే నిందితుడ్ని పోలీసులు కనిపెట్టారు. అతడ్ని అరెస్ట్‌ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు