ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Aug 24, 2020 , 16:43:42

సుశాంత్ తరుచుగా వెళ్లే రిసార్టులో సీబీఐ దర్యాప్తు

సుశాంత్ తరుచుగా వెళ్లే రిసార్టులో సీబీఐ దర్యాప్తు

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ తరుచుగా వెళ్లే ముంబైలోని ఒక రిసార్టును సీబీఐ అధికారులు సోమవారం సందర్శించారు. మరణానికి ముందు సుశాంత్ అంధేరీలోని వాటర్‌స్టోన్ రిసార్టులో సుమారు రెండు నెలల పాటు ఉన్నట్లు దర్యాప్తులో తెలిసింది. సుశాంత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ఆదివారం అక్కడికి వెళ్లగా సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో సీబీఐ టీమ్ సోమవారం మరోసారి ఆ రిసార్టుకు చేరుకున్నది. సుశాంత్ గురించి అక్కడి సిబ్బందిని ఆరా తీసింది.

మరోవైపు సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, అకౌంటెంట్ మేవతి, వంట మనిషి నీరజ్ సింగ్ సోమవారం కూడా సీబీఐ బస చేస్తున్న డీఆర్డీవో అతిథి గృహానికి చేరుకోగా వారి ముగ్గురిని అధికారులు ప్రశ్నించారు. సిద్ధార్థ్, నీరజ్‌తోపాటు పని మనిషి దీపేష్ సావంత్‌ను సీబీఐ అధికారులు శనివారం, ఆదివారం కూడా ప్రశ్నించారు. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఫ్యాన్‌కు వేలాడుతూ చనిపోగా ఆ సమయంలో ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. దీంతో ఈ ముగ్గురిని గత మూడు రోజులుగా సీబీఐ ప్రశ్నిస్తున్నది. ఆ ఇంటికి తీసుకెళ్లి సుశాంత్ మరణం గురించి అనేక ప్రశ్నలను ఆరా తీసింది.

 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo