బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 13:07:23

సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్, వంట మనిషిని ప్రశ్నించిన సీబీఐ

సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్, వంట మనిషిని ప్రశ్నించిన సీబీఐ

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆదివారం పలువురిని ప్రశ్నించింది. సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పిథాని ముంబైలో సీబీఐ బృందం ఉన్న డీఆర్డీవో గెస్ట్‌హౌస్‌కు ఉదయం వచ్చారు. అనంతరం సుశాంత్ ఇంట్లో కుక్‌గా పనిచేస్తున్న నీరజ్ అక్కడికి వచ్చింది. సుశాంత్ మరణం గురించి సీబీఐ అధికారులు వీరిద్దరిని ప్రశ్నించారు. సుశాంత్ వాడిన ఒక మొబైల్ ఫోన్ నెంబర్ స్నేహితుడైన సిద్ధార్థ్ పిథాని పేరున ఉన్నట్లు ఇటీవల దర్యాప్తులో తెలిసింది.


జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పదంగా మరణించాడు. అయితే ఆయనను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సుశాంత్ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించారు. తన కుమారుడి మరణానికి రియా, ఆమె కుటుంబ సభ్యులు కారణమంటూ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీహార్ ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించగా సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ నేపథ్యంలో గురువారం ముంబైకి చేరుకున్న సీబీఐ అధికారులు శుక్రవారం నుంచి దర్యాప్తు ప్రారంభించారు.



లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo