మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 18:01:02

ఇద్దరు ముంబై పోలీస్ అధికారులకు సీబీఐ సమన్లు

ఇద్దరు ముంబై పోలీస్ అధికారులకు సీబీఐ సమన్లు

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం ఇద్దరు ముంబై పోలీసు అధికారులకు సమన్లు జారీ చేసింది. సుశాంత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి భూషణ్ బెల్నేకర్, బాంద్రా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)ని తమ ఎదుట హాజరుకావాలని కోరింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని పేర్కొంది. కాగా ఈ ఇద్దరులో ఒకరు దవాఖానలో ఉండగా మరొకరికి కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మంగళవారం ఉదయం ముంబై పోలీసులు డీఆర్డీవో అతిథి గృహానికి వచ్చి సీబీఐ అధికారులను కలిసి కొంతసేపటి తర్వాత వెళ్లిపోయారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో గత శుక్రవారం నుంచి ముంబైలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సుశాంత్ మరణం కేసులో కీలకమైన ఆయన స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, వంటమనిషి నీరజ్ సింగ్, మరో పనిపనిషితోపాటు సుశాంత్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సీఏ సందీప్ శ్రీధర్ తోపాటు మాజీ అకౌంటెంట్ మేవతిని ప్రశ్నించారు. మరణానికి ముందు సుశాంత్ రెండు నెలలపాటు ఉన్న రిసార్టులోనూ సోమవారం దర్యాప్తు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo