సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 15:39:20

సుశాంత్ సీఏ, అకౌంటెంట్‌ను ప్రశ్నించిన సీబీఐ

సుశాంత్ సీఏ, అకౌంటెంట్‌ను ప్రశ్నించిన సీబీఐ

ముంబై: సుశాంత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఐదో రోజైన మంగళవారం పలువురిని ప్రశ్నించింది. ముంబైలోని డీఆర్డీవో అతిథి అతిథి గృహంలో ఉంటున్న సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం, సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితాని, వంటమనిషి నీరజ్ సింగ్ తోపాటు సీఏ సందీప్ శ్రీధర్, మాజీ అకౌంటెంట్ రజత్ మేవతిని ప్రశ్నించింది.  మంగళవారం ఉదయం వీరంతా డీఆర్డీవో అతిథి గృహానికి చేరుకున్నారు. జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న స్నేహితుడు సిద్దార్థ్, వంటమనిషి నీరజ్‌తో పాటు పని మనిషిని సీబీఐ గత మూడు రోజులుగా ప్రశ్నిస్తున్నది. కాగా సిద్దార్థ్, నీరజ్ విరుద్ధంగా స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో వారిద్దరిని మంగళవారం కూడా మరోసారి సీబీఐ ప్రశ్నించింది.

సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లినట్లు ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ సీఏ సందీప్ శ్రీధర్ తోపాటు మాజీ అకౌంటెంట్ మేవతి స్టేట్‌మెంట్లను సీబీఐ అధికారులు రికార్డు చేశారు. కాగా సుశాంత్ బ్యాంకు ఖాతాలో కోట్లలో డబ్బులు లేవని సీఏ సందీప్ శ్రీధర్ ఇటీవల ఒక ఇంటర్యూలో చెప్పారు.

మరోవైపు మంగళవారం ఉదయం ముంబై పోలీసులు డీఆర్డీవో అతిథి గృహానికి వచ్చి సీబీఐ అధికారులను కలిశారు. అనంతరం మాస్కులో ఉన్న వ్యక్తిని ఒక వాహనంలో అక్కడికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుశాంత్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఇప్పటి వరకు రియా చక్రవర్తికి సమన్లు జారీ చేయలేదు. ఆమె తరుఫు న్యాయవాది సతీశ్ సోమవారం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రియాకు సమన్లు జారీ చేస్తే సీబీఐ దర్యాప్తునకు ఆమె సహకరిస్తారని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo