శనివారం 24 అక్టోబర్ 2020
Crime - Sep 26, 2020 , 20:17:02

కస్టోడియల్ డెత్స్‌ కేసులో తొమ్మిది మంది పోలీసులపై సిబీఐ చార్జిషీట్

కస్టోడియల్ డెత్స్‌ కేసులో తొమ్మిది మంది పోలీసులపై సిబీఐ చార్జిషీట్

చెన్నై: తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో జరిగిన కస్టోడియల్ డెత్స్‌ కేసులో తొమ్మిది మంది పోలీసులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. వ్యాపారి జయరాజ్, అతడి కుమారుడు బెన్నిక్స్ కస్టడీ మరణానికి సంబంధించిన కేసులను సీబీఐ విచారిస్తున్నది. జూలై 7 న ఈ కేసును స్వాధీనం చేసుకున్న సీబీఐ.. రెండు నెలల విచారణ తరువాత రెండు కేసుల్లో జాయింట్‌గా చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడైన సబ్ ఇన్‌స్పెక్టర్ పౌల్దురై అదుపులో ఉన్నప్పుడే కొవిడ్ -19 కారణంగా మరణించాడు.

లాక్‌డౌన్‌ సమయంలో పరిమితికి మించి తమ దుకాణాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలతో తండ్రీకొడుకులను జూన్ 19 న సాతంకుళం పోలీసులు అరెస్ట్ చేశారు. అనేక మంది ప్రత్యక్ష సాక్షుల, సాక్ష్యాలు జయరాజ్, బెన్నిక్స్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు దారుణంగా హింసించారని, దీని ఫలితంగా కొద్ది రోజుల తరువాత వారు చనిపోయారని చెప్పారు. శవపరీక్ష నివేదిక ప్రకారం, జయరాజ్, బెన్నిక్స్ శరీరాలపై వరుసగా 17, 13 గాయాలయ్యాయి. దాంతో తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు జూన్‌ 22-23 మధ్య రాత్రి ఇద్దరూ చనిపోయారు. జయరాజ్, బెన్నిక్స్ కస్టడీ మరణాలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. 

ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులుగా అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్స్ ముతురాజ్, సమదురై, కానిస్టేబుల్స్ మురుగన్, వైల్ ముత్తు, చెల్లదురై, థామస్ ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్రపై పరిశీలన కొనసాగిస్తున్నట్టు సీబీఐ ఒక ప్రకటనలో తెలిపింది.


logo