హైదరాబాద్ : తన పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు నటుడు సోనుసూద్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. హైదరాబాద్కు చెందిన ఆశిష్ కుమార్ అనే వ్యక్తి సోనూసూద్ పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, సాయం కోసం ఎదురుచూసే వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్ ట్విట్టర్ ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలను మోసం చేయడం ఆపాలని, లేదంటే కటకటాల వెనుక ఉంటారన్నారు.