గురువారం 02 జూలై 2020
Crime - May 28, 2020 , 12:29:26

రామచంద్రాపురంలో చోరీ.. నగదు అపహరణ

రామచంద్రాపురంలో చోరీ.. నగదు అపహరణ

సంగారెడ్డి : జిల్లాలోని రామచంద్రాపురం ఎల్‌ఐజీ 162లో ఓ ఇంట్లో చోరీ జరిగింది. తాళాలు వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రూ.6.8 లక్షలను అపహరించుకుపోయారు. చోరీ ఘటన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. దుండగులు నంబరు ప్లేట్‌ లేని బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడ్డారు. అద్దెకు ఉంటున్న కుటుంబం స్వస్థలానికి వెళ్లిన సమయంలో చోరీ చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


logo