ఆదివారం 29 నవంబర్ 2020
Crime - Oct 28, 2020 , 19:40:22

మున్సిపల్ కమిషనర్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం

మున్సిపల్ కమిషనర్ లాకర్‌లో భారీగా నగదు, బంగారం

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఇటీవల ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన మహబూబ్‌న‌గ‌ర్ మున్సిపల్ కమిషనర్ వి.సురేందర్‌కు చెందిన లాక‌ర్ల‌ను అవినీతి నిరోధక‌శాఖ అధికారులు బుధ‌వారం తెరిచారు. లాక‌ర్ల‌లో రూ. 27.44 లక్షల నగదు, రూ. 17,24,744 విలువైన 808 గ్రాముల బంగారంతో పాటు వెండిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. న‌గ‌రంలోని హయత్‌న‌గ‌ర్‌లో గ‌ల ఇండియన్ ఓవర్సీర్ బ్యాంకు లాకర్‌లో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.