సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 14, 2020 , 07:09:49

బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్‌పై కేసు నమోదు

బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్‌పై కేసు నమోదు

హైదరాబాద్‌: ప్రభుత్వ స్థలంలో ప్లాటు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. డబ్బులు తీసుకుని ప్లాట్‌ ఇవ్వలేదు. దీంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే రిపోర్టర్‌నని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ గంగారెడ్డి కథనం ప్రకారం.. ఎల్లమ్మబండకు చెందిన చిలుకముక్క శ్రీనివాస్‌ తన స్నేహితుడు శివ ద్వారా శ్రీనివాస్‌నగర్‌లో నివాసం ఉండే ఎల్లంపల్లి నర్సింహులు (మీడియా రిపోర్టర్‌గా చెలామణి అవుతున్న వ్యక్తి) పరిచయం అయ్యాడు. గాజులరామారం డివిజన్‌ దేవేందర్‌నగర్‌లోని పోచమ్మబస్తీలోని సర్వేనంబర్‌ 329/1 ప్లాటు ఇప్పిస్తానని చెప్పి 2019లో ఎల్లంపల్లి నర్సింహులు 6లక్షల50వేల రూపాయలు తీసుకున్నాడు. దీంతో చిలకముక్కు శ్రీనివాస్‌ ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు వెళ్లగా అది నా ప్లాట్‌ అని వేరేవారు అడ్డుకున్నారు.

ఈ విషయమై ఎల్లంపల్లి నర్సింలును ప్రశ్నించగా  కైసర్‌నగర్‌లో మరో ప్లాట్‌ను చూపించాడు. అక్కడ కూడా వేరే వాళ్లు ఇది తమ స్థలమని అడ్డుకున్నారు. ఈ గొడవల్లో ఉన్న ప్లాట్లు తనకు వదంటూ తన డబ్బులను తిరిగి ఇవ్వాలని శ్రీనివాస్‌ ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో నర్సింహులు తాను రిపోర్టర్‌ను అంటూ బాధితున్ని బెదిరింపులకు గురి చేశాడు.దీంతో శ్రీనివాస్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఎల్లంపల్లి నర్సింలుపై పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo