శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jul 10, 2020 , 13:49:51

రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌... పోలీసులతో వాగ్వాదం

రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌... పోలీసులతో వాగ్వాదం

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ నియమాలను పాటించకపోవడమే కాక పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు కొందరు యువకులు. ఈ ఘటన హైదరాబాద్‌ అమీర్‌పేటలో చోటుచేసుకుంది. అమీర్‌పేటలో రాంగ్‌ రూట్‌లో వస్తున్న కారు ఫోటో తీసినందుకు ముగ్గురు యువకులు ట్రాఫిక్‌ హోంగార్డుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అడ్డుచెప్పిన ఎస్‌ఐతో సదరు యువకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


logo