బుధవారం 08 జూలై 2020
Crime - Apr 15, 2020 , 22:18:48

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన.. ముగ్గురిపై కేసు

లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘన.. ముగ్గురిపై కేసు

రాజన్న సిరిసిల్ల : జిల్లాలో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురిపై అధికారులు కేసు నమోదు చేశారు. వేములవాడ పట్టణంలో గాంధీనగర్‌కి చెందిన గొల్లపల్లి నాగయ్య టీ స్టాల్‌ నడుపుతుండడంతో కేసు నమోదు చేశామని పట్టణ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ తెలిపారు. వీర్నపల్లి మండలం శాంతినగర్‌ వద్ద రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన గేట్లను తీసేసి బైక్‌పై వెళ్తున్న కోనరావుపేట మండలం వట్టిమల్ల కమ్మరిపల్లి తండాకు చెందిన లాకావత్‌ మోతిరాం, భూక్యా బన్సీలాల్‌పై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామచంద్రంగౌడ్‌ తెలిపారు. logo