ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 28, 2020 , 07:22:32

మృతదేహాల దహన వ్యతిరేకులపై కేసు

మృతదేహాల దహన వ్యతిరేకులపై కేసు

పాట్నా: బీహర్‌ రాష్ట్ర రాజధాని పాట్నాలో కరోనా మృతదేహాల దహనానికి వ్యతిరేకంగా చట్ట విరుద్ధంగా నిరసన తెలిపిన 26 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాట్నాలోని బ్యాంగ్‌ఘాట్‌ సమీప నివాసులు తమ సమీప ప్రాంతంలో కరోనా మృతదేహాలను దహనం చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన తెలిపారు. కరోనా మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం పాటించనందుకు, అనుమతి లేకుండా నిరసన తెలిపినందుకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


logo