e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చిన అత్యాచార బాధితురాలు.. బిడ్డ‌ను వ‌దిలించ‌జూసిన‌ 13 మందిపై కేసులు

ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చిన అత్యాచార బాధితురాలు.. బిడ్డ‌ను వ‌దిలించ‌జూసిన‌ 13 మందిపై కేసులు

ముంబై: అత్యాచార బాధితురాలికి జ‌న్మించిన ఆడ‌బిడ్డను గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసే ప్ర‌య‌త్నం చేసిన 13 మందిపై పోలీసులు కేసులు న‌మోదుచేశారు. మహారాష్ట్ర‌లోని స‌తారా జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కొన్ని నెల‌ల క్రితం ఇద్ద‌రు యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ‌టంతో స‌తారా జిల్లాకు చెందిన ఓ 15 ఏండ్ల బాలిక గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం బాలిక కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌డంతో అబార్ష‌న్ చేయించాల‌ని చూశారు. కానీ అప్ప‌టికే అబార్ష‌న్ చేయాల్సిన స‌మ‌యం దాటిపోవ‌డంతో బాధ్యులెవ‌ర‌ని బాలిక‌ను నిల‌దీశారు.

దాంతో త‌న‌పై అత్యాచారానికి పాల్ప‌డిన ఇద్ద‌రు యువ‌కుల పేర్ల‌ను బాలిక వెల్ల‌డించింది. దాంతో కుటుంబ‌స‌భ్యులు ఆ ఇద్ద‌రు యువ‌కుల‌కు విష‌యం తెలియ‌జేసి పంచాయితీ పెట్టారు. ఈ సంద‌ర్భంగా నిందితులిద్ద‌రూ.. బాధితురాలు బిడ్డ‌కు జ‌న్మనిచ్చిన త‌ర్వాత ఆ బిడ్డ‌ను ఎక్క‌డైనా వ‌దిలేసే బాధ్య‌త త‌మ‌ద‌ని ఒప్పుకున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా బాధితురాలు ఆడ‌పిల్ల‌కు జ‌న్మనిచ్చింది. ముందు చేసుకున్న ఒప్పందం ప్ర‌కారం.. నిందితులు బాధితురాలి బిడ్డ‌ను ముంబైకి చెందిన దంప‌తులకు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

- Advertisement -

అయితే, ఆల‌స్యంగా ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బాలికపై అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక, ఆమె క‌న్న‌బిడ్డ‌ను చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప్ర‌క్రియ‌ను పాటించ‌కుండా ఇత‌రుల‌కు ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన నిందితులిద్ద‌రిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న మ‌రో 11 మందిపై కేసులు న‌మోదుచేశారు. వారిలో అత్యాచార బాధితురాలి కుటుంబానికి చెందిన ఒక స‌భ్యుడు కూడా ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement