శనివారం 16 జనవరి 2021
Crime - Dec 14, 2020 , 14:58:14

పిల్లల గొంతుకోసి చంపి దంపతులు ఆత్మహత్య..

పిల్లల గొంతుకోసి చంపి దంపతులు ఆత్మహత్య..

విల్లూపురం : తమిళనాడులోని విల్లూపురం జిల్లాలో హృదయ విధారక ఘటన జరిగింది. అప్పుల బాధ తాళలేక భార్యాభర్తలు ముగ్గురు పిల్లలను చంపి తామూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వలవనూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరగ్గా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పుత్తుపాలయం గ్రామానికి చెందిన మోహన్‌ రాజ్‌ (40)కు భార్య విమలేశ్వరీ(37)తోపాటు ముగ్గురు పదేళ్లలోపు పిల్లలున్నారు. ఇంటి పక్కనే దుకాణం ఏర్పాటు చేసుకొని కార్పెంటర్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

వ్యాపార, కుటుంబ అవసరాల నేపథ్యంలో గతంలో బ్యాంకుల్లో లోన్‌ తీసుకున్నాడు. లోన్‌ ఇచ్చిన వారు వడ్డీ చెల్లించాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తుండటంతో తీవ్ర మనోవేదనలో ఉన్నాడు. ఆదివారం రాత్రి ముగ్గురు పిల్లల గొంతుకోసి చంపి దంపతులిద్దరూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉదయం దుకాణానికి వచ్చిన వర్కరు షాపు తెరవకపోవడంతో ఇంటి కిటికీ నుంచి చూడగా మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ముడియంపక్కమ్‌లోని విల్లూపురం మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు అప్పులే కారణమా.! వెనుక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.