బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 18, 2020 , 10:39:27

కారులో ముగ్గురు కూర్చుని ఉండ‌గా.. నిప్పు అంటించి పారిపోయాడు

కారులో ముగ్గురు కూర్చుని ఉండ‌గా.. నిప్పు అంటించి పారిపోయాడు

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌వాడ వ‌ద్ద దారుణం జ‌రిగింది. కారులో ముగ్గురు కూర్చుని ఉండ‌గా, మ‌రో వ్య‌క్తి ఆ కారుకు నిప్పు అంటించి ప‌రారీ అయ్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆ కారులో ఉన్న ముగ్గురికి గాయాల‌య్యాయి. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ది.  కారుకు నిప్పు అంటించిన వ్య‌క్తిని వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించారు.  అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.  విజ‌య‌వాడు సీనియ‌ర్ పోలీసు ఆఫీస‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాజు క‌థ‌నం ప్ర‌కారం..  గంగాధ‌ర్ అనే వ్య‌క్తితో క‌లిసి వేణుగోపాల్ రెడ్డి వ్యాపారం చేశాడు.  వాసెకండ్ హ్యాండ్ కార్ల‌ను కొని అమ్మేవాళ్లు. అయితే ఇటీవ‌ల వాళ్ల వ్యాపారం స‌రిగా సాగ‌లేదు. న‌ష్టాలు రావ‌డంతో ఇద్ద‌రూ విడిపోయారు. 

సోమ‌వారం రోజున త‌న భార్య‌, స్నేహితుడితో క‌లిసి గంగాధ‌ర్‌.. వేణుగోపాల్ రెడ్డి వ‌ద్ద‌కు వెళ్లారు. కారును రోడ్డు మీద ఓ సైడ్‌కు పార్క్ చేసి న‌లుగురూ మాట్లాడుకున్నారు.  సాయంత్రం 4.45 నిమిషాల స‌మ‌యంలో సిగ‌రెట్ తాగుతాన‌ని చెప్పి కారు నుంచి వేణుగోపాల్ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. మందు బాటిల్‌లో తెచ్చిన పెట్రోల్‌ను కారుపై పోశాడు. దానికి నిప్పు అంటించి అక్క‌డ నుంచి అత‌ను పారిపాయిన‌ట్లు పోలీసులు చెప్పారు.  కారుకు నిప్పు రాజుకున్న స‌మ‌యంలో ముగ్గురూ ఆ కారులోనే ఉన్నారు. దంప‌తుల‌కు స్వ‌ల్ప గాయాలు కాగా, వారితో వ‌చ్చిన మ‌రో వ్య‌క్తికి సీరియ‌స్‌గా కాలిన గాయాల‌య్యాయి. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

logo