గురువారం 29 అక్టోబర్ 2020
Crime - Sep 21, 2020 , 12:43:50

‘ఓఆర్‌ఆర్‌’పై కారు బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు

‘ఓఆర్‌ఆర్‌’పై కారు బోల్తా.. ఐదుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌ : ఔటర్‌ రింగ్‌రోడ్డుపై కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు హిమాయత్‌ సాగర్‌ వద్దకు రాగానే టైరు ఊడిపోయి పల్టీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo