కారు, బైక్ ఢీకొని తల్లీకొడుకు మృతి

పెద్దపల్లి : కారు, బైక్ ఢీకొని తల్లీకుమారుడు మృతి చెందారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం బట్టుపల్లి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగపల్లి గ్రామానికి చెందిన దబ్బేట నాగరాజు (23) తల్లి రాజేశ్వరి (50) తో కలిసి బైక్పై మంథని వైపు వెళ్తున్నాడు. బట్టుపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవాఖానకు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన
- 30 నిమిషాల్లో 30 కేజీల ఆరెంజెస్ తిన్నారు.. ఎందుకంటే?
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్
- హైదరాబాద్లో 5జీ సేవలు రెడీ:ఎయిర్టెల్
- మొబైల్ కోసం తండ్రిని చంపిన కూతురు
- వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు