హైదరాబాద్ : కూకట్పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్ను, రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.