ఆదివారం 17 జనవరి 2021
Crime - Nov 18, 2020 , 10:21:54

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు

ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు

హైదరాబాద్‌ : ప్రమాదశాత్తు కారు అదుపు తప్పి రోడ్డు పక్కన నుంచి దూసుకెళ్లి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం జవహర్‌నగర్‌లోని ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని జవహర్‌నగర్‌లోని టోల్ గేట్ వద్ద అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తులను 108లో ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. కాగా.. సదరు వ్యక్తుల వివరాలు తెలియరాలేదు. వారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.