మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Aug 23, 2020 , 07:00:15

వాగులో కారుతో సహా ఇద్దరు గల్లంతు

వాగులో కారుతో సహా ఇద్దరు గల్లంతు

దేవాస్‌ : కల్వర్టు పైనుంచి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటబోయి కారుతో సహా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో చందన గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కారును కల్వర్టుపైకి వెళ్లనివ్వకుండా ఆపినా మద్యం మత్తులో ఉన్నో వారు పట్టించుకోకుండా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చీఫ్ పోలీస్ సూపరింటెండెంట్ (సీఎస్పీ) వివేక్ సింగ్ విలేకరులకు తెలిపారు. గడిచిన మూడురోజులుగా ఈ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo