బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Sep 01, 2020 , 09:01:05

కారు కేఫ్‌లోకి దూసుకెళ్లి నలుగురి దుర్మరణం

కారు కేఫ్‌లోకి దూసుకెళ్లి నలుగురి దుర్మరణం

ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో క్రాఫోర్డ్ మార్కెట్‌లో కారు అదుపుతప్పి కేఫ్‌లోకి  వేగంగా దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పైడోనీ పోలీస్ స్టేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపామని చెప్పారు. కారు బ్రేకులు ఫెయిలవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo