గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 03, 2020 , 14:48:56

టీవీ చూడటానికి బాలికలను ఇంట్లోకి పిలిచి.. ఒక్కొక్కరినీ గదిలోకి తీసుకెళ్లి..

టీవీ చూడటానికి బాలికలను ఇంట్లోకి పిలిచి.. ఒక్కొక్కరినీ గదిలోకి తీసుకెళ్లి..

బలోద్‌ : చత్తీస్‌ఘడ్‌ రాష్ర్టం బలోద్ జిల్లాలో ఇంట్లో టీవీ చూడటానికి పిలిచి ఐదుగురు మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన 65 ఏండ్ల వృద్ధుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. 

వివరాలు.. 8 నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు వీధుల్లో ఆడుకుంటుండగా టీవీ చూడటానికి రమ్మని వృద్ధుడు ఇంట్లోకి పిలిచేవాడు. మైనర్‌లను టీవీ ఎదుట కూర్చోబెట్టి ఒక్కొక్కరినీ గదిలోకి తీసుకెళ్లి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఇలా వరుసగా మూడ్రోజుల పాటు బాలికలను వేధించాడు. వారిలో ఓ బాలిక తోటి మిత్రులతో ఆడుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో ఏమైందని తల్లి అడగ్గా జరిగిన విషయం మొత్తాన్ని ఆమె తల్లికి  చెప్పడంతో ఈ నేరం వెలుగులోకి వచ్చింది. మరో నలుగురు బాలికలు కూడా వారి తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా వృద్ధుడిని అరెస్టు చేసినట్లు బలోద్ ఎస్పీ జితేంద్ర మీనా తెలిపారు. అర్జుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరగ్గా 28 నుంచి 30 వరకు మూడ్రోజుల పాటు నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

నిందితుడిపై లైంగిక వేధింపులు, కిడ్నాప్, లైంగికదాడి, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపాడు. బాలికలకు ప్రాథమిక పరీక్ష నిమిత్తం దవాఖానకు తరలించగా శరీరంపై గాయాలు బయటపడలేదని, ఫోరెన్సిక్ పరీక్ష కోసం కొన్ని నమూనాలను పంపించామని ఫలితాలు రావాల్సి ఉందని ఆయన అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo