ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jun 27, 2020 , 18:19:37

హ్యాకర్లకు 8.6 కోట్లు చెల్లించిన కాలిఫోర్నియా వర్సిటీ

హ్యాకర్లకు 8.6 కోట్లు చెల్లించిన కాలిఫోర్నియా వర్సిటీ

బ్లూమ్‌బర్గ్‌ : ర్యాన్సమ్‌వేర్‌ దాడి నుంచి బయటపడేందుకు శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధికారులు క్రిమినల్‌ హ్యాకర్టలకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయం అధికారులే స్వయంగా వెల్లడించారు. ఒక రకమైన హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఎదుటివారి కంప్యూటర్లలో జొప్పించి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేయడాన్నే రాన్‌సమ్‌వేర్‌ అంటారు. డబ్బు చెల్లించే వరకు కంప్యూటర్ సిస్టమ్‌కు ప్రాప్యతను నిరోధించడానికి ఇది రూపొందించబడింది.

శాన్‌ఫ్రాన్సిస్కో లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కంప్యూటర్లను క్రిమినల్‌ హ్యాకర్లు హ్యాక్‌ చేశారు. స్కూల్ ఆఫ్ మెడిసిన్ లోపల ఉన్న సర్వర్లపై డేటాను హ్యాకర్లు తమ గుప్పిట్లోకి తీసుకొన్నారు. తమ చేతుల్లో బంధీ అయిన మీ నెట్‌వర్క్‌ను వదిలిపట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దాంతో చేసేదేమీ లేక క్రిమినల్ హ్యాకర్లకు 1.14 మిలియన్‌ డాలర్లు యూనివర్సిటీ చెల్లించింది. ఈ మొత్తం భారతీయ కరెన్సీలో రూ.8.6 కోట్లకు సమానం.

ఈ సమయంలో కరోనా వైరస్ సంబంధిత యాంటీబాడీ పరీక్షల నిర్వహణలో యూసీఎస్‌ఎఫ్‌ పరిశోధకుల నిమగ్నమై ఉన్నారు. సర్వర్లను హ్యాక్‌ చేసినప్పటికీ కొవిడ్‌-19 పరిశోధనలకు ఎలాంటి ఆటంకం కలుగలేదని యూనివర్సిటీ అధికారులు చెప్పారు. దెబ్బతిన్న సర్వర్లను పునరుద్ధరించడానికి విశ్వవిద్యాలయం సైబర్‌ సెక్యూరిటీ కాంట్రాక్టర్ల బృందంతో కలిసి పనిచేస్తోంది.

"ఎన్‌క్రిప్ట్‌ చేయబడిన డేటా ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడేలా మేము అనుసరించే కొన్ని విద్యా పనులకు ముఖ్యమైనది" అని ఒక ప్రకటనలో తెలిపింది. "అందువల్ల హ్యాకర్లకు డబ్బు చెల్లించడానికి కష్టమైన నిర్ణయం తీసుకున్నాము." అని వెల్లడించింది. జూన్ 1 వ తేదీన ఈ హ్యాకింగ్‌ను గుర్తంచారు. నెట్‌వాకర్ అని పిలువబడే మాల్వేర్‌ను ఉపయోగించి హ్యాకర్లు డేటాను పొందారని పేర్కొన్నది.


logo