శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 14, 2020 , 11:47:46

బస్సు, వ్యాన్‌ ఢీ.. వ్యక్తి మృతి

బస్సు, వ్యాన్‌ ఢీ.. వ్యక్తి  మృతి

పాల్ఘర్ : మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో ముంబై, అహ్మదాబాద్ హైవేపై గురువారం మధ్యాహ్నం బస్సు, వ్యాన్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతిచెందాడు.  గాయపడిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో మనోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేఖలే గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్టీసీ) బస్సు గుజరాత్ వైపు వెళ్తూ ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. తరువాత రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయని పాల్ఘర్ పోలీసు ప్రతినిధి సచిన్ నవద్కర్ తెలిపారు. 

ఈ ఘటనలో వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మరణించాడు. కొంతమంది బస్సు ప్రయాణికులు గాయపడగా వారిని సమీపంలోని దవాఖానకు తలరించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు. అగ్నిమాపక, జిల్లా విపత్తు నియంత్రణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo