సోమవారం 25 జనవరి 2021
Crime - Oct 11, 2020 , 18:47:15

రాజస్థాన్‌, యూపీ తర్వాత.. ఇప్పుడు తమిళనాడులో పూజారి హత్య

రాజస్థాన్‌, యూపీ తర్వాత.. ఇప్పుడు తమిళనాడులో పూజారి హత్య

చెన్నై : అర్చకులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్న అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా వినవస్తున్నాయి. తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన పండిత్‌ ముస్నిస్వరర్ ఆలయ పూజారిని గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుడు పూజారి ఆంధ్రకోట్టం గ్రామ నివాసి జీ ముత్తురాజాగా పోలీసులు గుర్తించారు.

రాజస్థాన్‌లో ఒక పూజారిని భూ వివాదంలో సజీవ దహనం చేయగా.. ఉత్తరప్రదేశ్‌లో ల్యాండ్‌ మాఫియా పూజారిని కాల్చి చంపారు. గుర్తుతెలియని దుండగుల బృందం ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించి పూజారిని కర్రలు, ఇతర ఆయుధాలతో కొట్టారు. ఆలయంలో పెద్ద సంఖ్యలో ఉన్న భక్తులు ఈ హఠాత్‌ పరిణామంతో భయపడి తలా ఒకవైపు పరుగెత్తారు. తీవ్రంగా గాయపడిన పూజారి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న మదురై నగర డిప్యూటీ కమిషనర్ ఆర్ శివ్‌ప్రసాద్ ఆలయానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాజీ దవాఖానకు తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కొన్ని నెలల క్రితం ఆలయ ప్రాంగణంలో జరిగిన చెవి కుట్టుడు కార్యక్రమంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకోవడానికి పూజారి ముత్తురాజాపై దాడికి దిగారు. అన్నానగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo