సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 03, 2020 , 17:44:54

ఐదంత‌స్తుల భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో బిల్డ‌ర్ అరెస్టు

ఐదంత‌స్తుల భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో బిల్డ‌ర్ అరెస్టు

ముంబై : రాయ్‌గడ్ జిల్లాలో ఐదంత‌స్తుల భ‌వ‌నం కూలిన దుర్ఘ‌ట‌న‌లో మ‌హారాష్ర్ట‌ పోలీసులు నేడు బిల్డ‌ర్‌ను అరెస్టు చేశారు. ఆగ‌స్టు 24న భ‌వ‌నం కూలిన ఘ‌ట‌న‌లో 16 మంది చ‌నిపోయారు. ఈ కేసులో బిల్డ‌ర్ ఫ‌రూక్ ఖాజీని పోలీసులు అరెస్టు చేసి స్థానిక న్యాయ‌స్థానంలో హాజ‌రుప‌రిచారు. ఖాజీ వృత్తిరీత్యా బిల్డ‌ర్‌. కేసుకు సంబంధించి ఫ‌రూక్ స్థానిక సెష‌న్ కోర్టులో మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. బెయిల్ పిటిష‌న్‌ను తిర‌స్క‌రించిన న్యాయ‌స్థానం విచార‌ణ నిమిత్తం పోలీస్ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. ఈ కేసుకు సంబంధించి మ‌హారాష్ర్ట పోలీసులు ఇప్ప‌టికే ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్ష‌న్లు 304, 304-ఎ, 337, 338, 34 కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. కూలిన భ‌వ‌నం ఐదారేండ్ల కిత్ర‌మే నిర్మించ‌బ‌డింది. భ‌వ‌నంలో సుమారు 40 ప్లాట్ల వ‌ర‌కు ఉన్నాయి. 


logo