సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 20:45:07

రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం

రూ. 10 లక్షల విలువైన వెండి ఆభరణాలు స్వాధీనం

బాసిర్‌హట్‌ : పశ్చిమ బెంగాల్‌లోని కైజూరి నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 10 లక్షల  విలువైన వెండి ఆభరణాలను దక్షిణ బెంగాల్ సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్)  స్వాధీనం చేసుకున్నాయి. గురువారం రాత్రి బైక్‌పై వస్తున్న స్మగ్లర్‌ సరిహద్దు చెక్‌పోస్టు వద్దకు రాగానే బీఎస్‌ఎఫ్‌ సిబ్బందిని గమనించి భయంతో తప్పించుకునేందుకు యత్నించాడు. భద్రతా దళాలు వెంబడించగా అతడు బైక్‌ను వదిలి పరారయ్యాడు. భద్రతా దళాలు బైక్‌ టూల్ బాక్స్ తెరిచి చూడగా సుమారు 13 కిలోల వెండి ఆభరణాలను ఉండడంతో వీటితోపాటు బైకును సీజ్‌ చేశారు. బైక్ నెంబర్ ఆధారంగా నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


logo