శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 07, 2020 , 12:16:15

హిల్షా చేపలు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

హిల్షా చేపలు అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్టు

పెట్రాపోల్‌ : పశ్చిమ బెంగాల్‌లోని ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు ఐసీపీ పెట్రోపోల్ గుండా బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు హిల్షా చేపలను అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని గురువారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) సిబ్బంది అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.11,26,000 విలువైన చేపలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ట్రక్కును బీఎస్‌ఎస్‌ సిబ్బంది సాధారణ ఆపరేషన్‌లో భాగంగా నిలిపి క్యాబిన్‌లో అనుమానాస్పదంగా కనిపించిన తొమ్మిది తెల్ల సంచులను తనిఖీ చేయగా హిల్షా చేపలు కనిపించాయి.

కస్టమ్ క్లియరెన్స్ లేకుండా తరలిస్తుండడంతో సీజ్‌ చేసి బీప్లాబ్ షిల్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు 24 పరగనాస్ జిల్లావాసి. ఆగస్టు 4న ట్రక్కుతో బంగ్లాదేశ్ వెళ్లి హిల్షా చేపలతో తిరిగి వస్తున్నాడు. చేపలు తీసుకువచ్చేందుకు స్మగర్లతో రూ.5 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న చేపలతోపాటు నిందితుడిని పెట్రాపోల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
logo