Crime
- Dec 16, 2020 , 10:40:29
చేపల వేటకు వెళ్లి అన్నదమ్ముళ్ల మృతి

హైదరాబాద్ : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం తజల్పూర్లో విషాదం నెలకొంది. తజల్పూర్లో గ్రామ చెరువులోకి చేపల వేటకు వెళ్లి ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. మృతులను కాట్రోత్ హరిరాం (32), కాట్రోత్ శివకుమార్ (25)గా గుర్తించారు. కాగా, యువకులిద్దరూ అన్నదమ్ములు కాగా.. శివ్వంపేట మండలం పాండ్యాతాండ వాసులు. ఇద్దరు అన్నదమ్ములు చేపల వేటకు వెళ్లి మృత్యువాతపడడంతో కుటుంబంలో రోధనలు మిన్నంటాయి. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
MOST READ
TRENDING