శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 11:36:16

మద్యం మత్తులో ఒకరినొకరు పొడుచుకున్న అన్నదమ్ములు

మద్యం మత్తులో ఒకరినొకరు పొడుచుకున్న అన్నదమ్ములు

ఘజియాబాద్ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ర్టం ఘజియాబాద్‌లో మద్యం మత్తులో అన్నదమ్ములు ఒకరినొకరు పొడుచుకొని మృతి చెందారు. వివరాలు.. ఘజియాబాద్‌కు చెందిన అన్నదమ్ములు మోటా(32), మోహన్‌లాల్‌(28)  సోమవారం రాత్రి ఒకేచోట కూర్చొని ఫూటుగా మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో ఏదో విషయమై ఇద్దరు వాగ్వాదానికి దిగారు. మాటా మాటా పెరిగి గొడవ తీవ్రం కావడంతో కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు.

ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ తీవ్రంగా గాయపడగా స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఎంఎంజీ జిల్లా దవాఖానకు తరలించారు.  చికిత్స పొందుతూ ఇద్దరు మంగళవారం మరణించినట్లు ఎస్పీ మనీశ్‌ మిశ్రా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, వారి మేనల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo