కొత్తగూడెం: సొంత చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చెల్లిపై దారుణానికి పాల్పడిన విషయం బయటపడంతో లైంగికదాడి చేసిన పెద్దమ్మ కొడుకు అజయ్ సూసైడ్ చేసుకున్నాడు. కొత్తగూడెం రామవరంలోని తమ ఇంట్లో ఉరేసుకున్నాడు. తనపై కొన్నేండ్లుగా సొంత అన్నతోపాటు, పెద్దమ్మ కుమారుడు అజయ్ లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఓ యువతి కొత్తగూడెం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్లో సొంత చెల్లిపై అన్నతోపాటు పెద్దమ్మ కొడుకు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. గత కొన్నేండ్లుగా లైంగికదాడి చేస్తున్న యువకులు, ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అన్నలు ఇబ్బందులు పెడుతున్న విషయం తన అమ్మ, పెద్దమ్మ, పెద్దనాన్నకు చెప్పానని, అయినా పట్టించుకోకపోగా వారికే సపోర్ట్ చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు పిర్యాదు చేస్తానని చెప్పినప్పుడల్లా తనను చంపుతానని బెదిరించేవారని వాపోయింది. తన తండ్రి లేకపోవడతో అలుసుగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడ్డారని తెలిపింది. వారి చిత్రహింసలు భరించలేక నిన్న రాత్రి కొత్తగూడెం టూ టౌన్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు తనపై కేసు నమోదుచేయడంతో భయాందోళనకు గురైన అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..